ఓటు ఎలా వేయాలో తెలుసా?.. కొత్త ఓటర్లకు సూచనలు

byసూర్య | Tue, Nov 28, 2023, 06:50 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 30న ఓటింగ్ జరగనుంది. ఈ సారి చాలా మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దాదాపు 17 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 8 లక్షలకు పైగా కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. అయితే ఓటు ఎలా వేయాలి? పోలింగ్ స్టేషన్‌ లోపల ఏం జరుగుతుంది? అనే విషయాలు చాలా మందికి తెలియవు. అసలు పోలింగ్ స్టేషన్ లోపల పక్రియ ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం..


పోలింగ్ స్టేషన్‌, బూత్‌లో ఓటు వేసే ప్రక్రియ..


ఓటర్లు తమ పోలింగ్ బూత్‌ను కనుగొనడానికి electoralsearch.inకి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి అడగవచ్చు.


పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి. (ఓటర్ కార్డు లేకున్నా ఓటెయ్యొచ్చు.. ఈ 12 కార్డుల్లో ఏది ఉన్నా ఓకే..!)


మీ ఇంటి వద్దకే వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చి వెళతారు.


ఒక వేళ మీకు ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ బూత్‌ కౌంటర్స్‌లో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్ల వద్ద పొందవచ్చు.


పోలింగ్ స్టేషన్‌లో మెుదటి అధికారి ఓటరు జాబితాలో, గుర్తింపు కార్డులో మీ పేరును పరిశీలిస్తారు.


మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు.


మూడో అధికారి ఆ చీటిని చెక్ చేస్తారు.


అప్పుడు మీరుఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి.


ప్రిసైడిండ్ అధికారి/ పోలింగ్ అధికారి బటన్ నొక్కడం ద్వారా ఈవీఎం యంత్రంపై మీరు ఓటు వేసేందుకు అనుమతిస్తారు.


మీరు ఈవీఎం యంత్రం ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రదేశానికి వెళ్లగానే.. అక్కడ ఈవీఎం బ్యాలెట్‌పై అభ్యర్థుల పేర్లు, పార్టీ పేరు, ఆయనకు సంబంధించిన గుర్తు కనిపిస్తాయి.


ఈవీఎంలో మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌పై నొక్కాలి. అప్పుడు దాని పక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలగడంతో పాటు పెద్దగా బీప్ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క.


మీరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ వస్తుంది. ఈవీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) వద్ద దాన్ని చూడవచ్చు.


సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఎవరికి ఓటు వేశామో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.


ఒకవేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా.. బదులుగా బీప్ సౌండ్ వినిపించకపోయినా మీరు ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి.


గమనిక: పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు లేదా మరే ఇతర గాడ్జెట్ అనుమతించబడదు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM