గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర: పాడి కౌశిక్ రెడ్డి

byసూర్య | Tue, Nov 28, 2023, 06:25 PM

 తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావటంతో అభ్యర్థులు తమ చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకుని గెలిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పాడి కౌశిక్ రెడ్డి.. చివరి రోజు తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. " మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నా శవయాత్రకు మీరు రండి." అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ప్రచారంలో తన భార్యాబిడ్డలతో నిర్విరామంగా ప్రచారం నిర్వహించిన కౌశిక్ రెడ్డి.. చివరి రోజు సంచనల కామెంట్లు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కౌశిక్ రెడ్డి తరపున తన కూతురు శ్రీనిక చేసిన ప్రచారం.. అందరి దృష్టిని ఆకర్షించింది. హుజూరాబాద్‌లో కేసీఆర్ చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన శ్రీనిక.. తన తండ్రిని గెలిపించాలని.. తన తండ్రిని గెలిపిస్తే హుజూరాబాద్‌కు 2000 వేల కోట్లు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానంటూ హామీ ఇవ్వటం.. వైరల్ కూడా అయ్యింది. అయితే.. హుజూరాబాద్ నుంచి బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో ఉండటం గమనార్హం. మొన్న జరిగిన ఉపఎన్నికల్లోనూ.. ఈటల రాజేందర్ మీద పోటీ చేసి కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. కాగా.. ఇప్పుడు మరోసారి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM