24 ఏళ్లుగా తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకున్నా.. చివరి ప్రచార సభలో కేసీఆర్

byసూర్య | Tue, Nov 28, 2023, 06:21 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం ముగిసింది. అయితే.. షెడ్యూల్ విడులైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు తీసకుని ప్రచారం నిర్వహించిన.. గులాబీ అధినేత కేసీఆర్.. మొత్తం 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అయితే.. ఈరోజు ప్రచారం చివరి రోజు కాగా.. ఆఖరి ప్రచార సభను గజ్వేల్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్.. కొంత ఎమోషనల్‌గా ప్రసంగించారు. గ‌త 24 ఏళ్లుగా తెలంగాణనే ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాన‌ని కేసీఆర్ తెలిపారు. గ‌జ్వేల్ ప్రజలు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి సీఎం చేసి పంపిస్తే.. తెలంగాణ అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డినట్టు తెలిపారు. తాను చేసిన కృషి అంతా ప్ర‌జ‌ల కళ్ల ముందు క‌నిపిస్తోందన్నారు కేసీఆర్.


"ఈ ఎన్నిక‌ల్లో ఇది నా చివ‌రి స‌భ‌.. ఇది 96వ స‌భ‌. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒక‌సారి చెప్పాలి. గ‌జ్వేల్ నుంచి మీరు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాను. కృషి చేశాను. అవ‌న్నీ ప్ర‌జ‌ల కండ్ల ముందు క‌న‌బ‌డుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చేట‌టువంటి ట్రిపుల్ ఆర్ కూడా మ‌న గ‌జ్వేల్ మీదుగానే రాబోతుంద‌ని సంతోషంగా తెలియ‌జేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణ‌నే ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాను. ఆ విష‌యం మీ అంద‌రికి తెలుసు" అంటూ గజ్వేల్ ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. మరోవైపు.. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళిత కుటుంబాల‌కు కేసీఆర్ తీపి కబురు వినిపించారు. ఈ ఎన్నిక‌లవ్వగానే.. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే విడ‌త‌లో ద‌ళిత‌బంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ద‌ళిత‌వాడ‌ల్లోని ద‌రిద్రాన్ని పారద్రోలుదామని.. కేసీఆర్ పేర్కొన్నారు.


"ఫిబ్ర‌వ‌రి నెల వ‌స్తే నాకు 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌స్తుంది. మీ అంద‌రి ఆశీర్వ‌ాదంతోని.. తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశ‌మంత ఉంది. ప‌ద‌వులు కాదు ఇక్క‌డ ముఖ్యం. ఇప్పటికే ప‌దేళ్లు ముఖ్య‌మంత్రిగా చేశాను. తెలంగాణ రేపు ఒక అద్భుత‌మైన రాష్ట్రం కావాలి. పేద‌రికం శాశ్వ‌తంగా పోయే రాష్ట్రం కావాలి. నిర‌క్ష‌రాస్య‌త లేని వంద శాతం అక్ష‌రాస్య‌త ఉండే రాష్ట్రం కావాలి. చాలా వైద్య స‌దుపాయాలు ప్ర‌జ‌ల‌కు ఫ్రీగా అందే తెలంగాణ కావాలి. పేద‌లు లేని తెలంగాణ కావాలి.. ఉట్టిగా నోటితో చెబితే ఇదంతా కాదు. పగలూ రాత్రి కృషి చేయాలి. ఈ పదేళ్లలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. అనుకున్న లక్ష్యం చేరాలంటే.. మళ్లీ బీఆర్ఎస్‌కు ఓటేసి గెలిపించండి. మీరు ఓటేసి గెలిపిస్తే.. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తున్నా." అంటూ కేసీఆర్ ప్రసంగించారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM