గెలిచేది కాంగ్రెస్..వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

byసూర్య | Tue, Nov 28, 2023, 01:42 PM

ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే…ఇంద్రమ్మ రాజ్యమే…నని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి తన పార్టీ శ్రేణులతో కలిసి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దోరల పాలనకు.. కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు వచ్చిందన్నారు. రాష్ట్ర మొత్తం మార్పు కోసమే చూస్తున్నారని, రాష్ట్రంలో కూడా ఈసారి అధికార పార్టీకి భారీ ఓటమి తప్పదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజల కోసమే ప్రవేశపెట్టిందన్నారు. ఊరు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని, అది కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలన్ని అభివృద్ధి జరుగుతాయని అన్నారు.
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని మంత్రి కేటీఆర్ ను ఓడించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు కదం తొక్కుతున్నారన్నారు. నిరుద్యోగుల ఉసిరి పోసుకున్న ఘనత కెసిఆర్ కేటీఆర్ కి దక్కిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాట వాడుతున్న టిఆర్ఎస్ పార్టీకి చరమగీతం రాష్ట్ర ప్రజలు పాడనున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆరోగ్యశ్రీని,108 వాహనాన్ని కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఆ నలుగురి పాలనతో రాష్ట్ర మొత్తం అవినీతిమయమైందన్నారు. ఊరురా ఇందిరమ్మ ఇల్లును ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందించినామని తెలిపారు. తంగళ్ళపల్లి మండలంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో చూపెట్టాలన్నారు.


Latest News
 

కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య Fri, Sep 20, 2024, 03:57 PM
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి Fri, Sep 20, 2024, 03:57 PM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలి: ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 03:56 PM
జానీ మాస్టర్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు. Fri, Sep 20, 2024, 03:55 PM
*మెడికల్ కళాశాల తెచ్చిన మాపై నిర్బందమా..? అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 03:54 PM