జానీ మాస్టర్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు.

byసూర్య | Fri, Sep 20, 2024, 03:55 PM

తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌కు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.మొత్తం 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. మరి కాసేపట్లో పోలీసులు ఆయనను చెంచలగూడ జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై ఫోక్స్ యాక్ట్ నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం.


కాగా జానీ మాస్టర్‌పై నమోదైన అత్యాచారం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇవాళ ఉదయం పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేపించారు. అనంతరం ఆయనను రాజేంద్రనగర్‌ సీసీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఉప్పర్‌పల్లి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు.


 


కాగా జానీ మాస్టర్‌పై రేపు కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇవాళ ఉదయం పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేపించారు. అనంతరం ఆయనను రాజేంద్రనగర్‌ సీసీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఉప్పర్‌పల్లి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నిన్న (గురువారం) గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.


కాగా జానీ ప్రశ్నించేందుకు సమయం దొరక్కపోవడంతో పోలీసులు కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై రేప్ కేసు నమోదయింది. కేసు విషయం తెలుసుకొని ఆయన పరారయ్యారు. బెంగళూరు గుండా గోవా వెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ తీసుకొచ్చారు. జానీ మాస్టర్‌పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. అదే రోజున నార్సింగ్‌ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM