పారదర్శకంగా ఓటరు జాబితా..

byసూర్య | Fri, Sep 20, 2024, 04:11 PM

పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించనున్నట్లు కోదాడ ఎంపీడీవో రామచందర్ రావు తెలిపారు.గురువారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ,తుది ఓటర్ల జాబితా రూపకల్పనపై మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించారు.జాబితాపై ఈనెల 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఎటువంటి అభ్యంతరాలు ఉన్న గ్రామపంచాయతీ కార్యదర్శులను కలిసి సవరణ చేసుకోవాలన్నారు.
తదుపరి డిపిఓ ఆదేశాల మేరకు ఈనెల 28న వార్డుల వారిగా తుది జాబితాను ప్రచూరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాండు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవూరి వెంకటాచారి, తొండపు సతీష్,తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పుగండ్ల శ్రీను, జనపనేని కృష్ణ, వేమూరి సురేష్,జనసేన నాయకులు కస్తూరి సురేష్, కొల్లు నవీన్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM