ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ రూ.6 వందల కోట్లు ఖర్చు పెట్టింది: ఈటల

byసూర్య | Wed, Nov 22, 2023, 09:25 AM

సీఎం కేసీఆర్‌తో పోటీ చేసే రోజు వస్తుందని ఊహించలేదని బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని బీజేపీ నాయకత్వాన్ని కోరాను. నా మీటింగ్‌కి వెళ్లవద్దని బీఆర్‌ఎస్‌ డబ్బులు చెల్లిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ రూ.6వందల కోట్లు ఖర్చుపెట్టింది. 20 ఏళ్లలో ఏ నాయకుడితోనూ గొడవ పడలేదు’’ అని ఈటల అన్నారు.


నేను కులపరంగా ఎదగలేదు, ఉద్యమబిడ్డగా ఎదిగాను అని ఈటల రాజేందర్‌ అన్నారు. నేను ఫైటర్‌ కాబట్టే. కేసీఆర్‌ నాకు అవకాశమిచ్చారని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని మాట్లాడారు. 'ఏ పదవి ఇచ్చినా. ఆ పదవికి వన్నె తెచ్చాను. ఏ పోరాటాలతో తెలంగాణ వచ్చిందో, ఆ పోరాటాల్నే కేసీఆర్‌ వద్దన్నారు. 2017లో నాకు, కేసీఆర్‌కు కొట్లాట మొదలైంది. నేను భూకబ్జా చేసినట్టు, ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నట్టు నిరూపించండి. నాపై 365 రోజులు. 360 డిగ్రీల్లో పూర్తి నిఘా ఉంటుంది." అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.


Latest News
 

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 02:54 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 02:52 PM
ముందస్తు అరెస్టు చేయడం దారుణం Fri, Sep 20, 2024, 02:47 PM
రాజకీయ పార్టీల వారితో ఓటరు జాబితా అభ్యంతరముల సమావేశం Fri, Sep 20, 2024, 02:45 PM
క్రీడలతో పాటు విద్యలో రాణించాలి Fri, Sep 20, 2024, 02:30 PM