బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,,,,తెలంగాణలో మూడ్రోజుల వర్షాలు

byసూర్య | Tue, Nov 21, 2023, 09:02 PM

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ హైదరాబాద్ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది.


ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. ఈనెల 23 -26 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు పడతాయన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు.


ఇవాళ ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. రేపటి నుంచి (బుధవారం) తేలికపాటి నుంచి మోస్తరు.. లేని పక్షంలో ఉరములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములతో కూడిన జల్లులకు ఛాన్స్ ఉంటుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు.


Latest News
 

మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర, అమల్లోకి ఆంక్షలు Tue, Nov 28, 2023, 06:34 PM
గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర: పాడి కౌశిక్ రెడ్డి Tue, Nov 28, 2023, 06:25 PM
24 ఏళ్లుగా తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకున్నా.. చివరి ప్రచార సభలో కేసీఆర్ Tue, Nov 28, 2023, 06:21 PM
24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా. శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్ Tue, Nov 28, 2023, 03:47 PM
కేసీఆర్‌ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు: ఈటల Tue, Nov 28, 2023, 03:05 PM