తెలంగాణలో ఐటీ దాడులు,,,,మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలు

byసూర్య | Tue, Nov 21, 2023, 09:08 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో 9 రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు, వారి బంధువులు, అనుచరుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగ్గా.. ఇవాళ ఓ మాజీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జి.వివేక్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నూరులోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్‌ సోమాజిగూడలోని నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, కార్యాలయాలు, బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.


తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా వివేక్ బరిలో నిలిచారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 610 కోట్లకుపైగా ఆస్తులను ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా తాను అప్పు ఇచ్చినట్లు వివేక్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక చెన్నూరులో వివేక్ ధన ప్రలోభానికి తెరలేపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ దాడుల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు చెన్నూరులోని వివేక్ ఇంటికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతవారణం నెలకొంది.


ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్, ఆ పార్టీ నేత పారిజాత నర్సింహ్మారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలతో పాటు బీఆర్ఎస్ మహేశ్వరం అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచురల నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి సబితా అనుచరుల నివాసాల్లో భారీగా నగదును సీజ్ చేశారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా నగదును నిల్వ చేశారన్న సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎన్నికల వేళ ఇలా ఐటీ అధికారులు వరుసుగా దాడులు చేయటం కలకలం రేపుతోంది.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM