బీఆర్ఎస్ నేత ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. భారీగా నగదు పట్టివేత

byసూర్య | Tue, Nov 21, 2023, 07:30 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచార పర్వంతో పాటు ప్రలోభ పర్వంలో కూడా జోరుగ పెంచాయి. ఓటర్లను ప్రలోభ పెట్టి ప్రసన్న చేసుకునేందుకు.. నగదు, మద్యంతో పాటు బహుమతులు కూడా పంపణీ చేస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రలోబాలను అరికట్టేందుకు ఈసీ అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో చేస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం పట్టుబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. తెలంగాణలోనే అత్యధికంగా సొత్తు పట్టుబడటం గమనార్హం.


అయితే.. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలతో పాటు కొంచెం అనుమానం వచ్చినా సరే.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా నేతల ఇళ్లల్లో దాడులు చేస్తున్నారు. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రఫిక్ అనే వ్యాపార వేత్త, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు సదరు.. బీఆర్ఎస్ నేత ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో దాడి చేసిన అధికారులు.. సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాడులు చేసిన సమయంలో.. అధికారులు క్యాష్ కౌంటింగ్ మిషన్లను లోపలికి తీసుకెళ్లటం కనిపించింది. దీంతో.. లోపల గట్టిగానే నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. అయితే.. ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు అనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. ఉదయం నుంచి రఫిక్ జిన్నింగ్ మిల్లులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి తరలించనున్నారు.. అన్న పలు అంశాలపై బీఆర్ఎస్ నేత రఫిక్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.



Latest News
 

24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా. శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్ Tue, Nov 28, 2023, 03:47 PM
కేసీఆర్‌ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు: ఈటల Tue, Nov 28, 2023, 03:05 PM
వారికి కూడా పట్టాలు ఇస్తాం: సీఎం కేసీఆర్ Tue, Nov 28, 2023, 03:01 PM
కాంగ్రెస్ అంటేనే కరెంట్. అర్థం చేసుకో పిచ్చోడా: భట్టి విక్రమార్క Tue, Nov 28, 2023, 02:59 PM
ఎవనికి కావలి ఇందిరమ్మ రాజ్యం?: సీఎం కేసీఆర్ Tue, Nov 28, 2023, 02:04 PM