ప్రమోషన్ కోసం వెళితే ఎమ్మెల్సీ పదవి,,,,గోరటి వెంకన్న ఆసక్తికర విషయం

byసూర్య | Tue, Nov 21, 2023, 07:09 PM

తెలంగాణ ఉద్యమంలో తన జానపద పాటలతో, కవిత్వంతో ప్రజలను జాగృతం చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ప్రజాకవి గోరటి వెంకన్న. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన... మంత్రి కేటీఆర్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి సహా పలు అంశాలపై మంత్రి కేటీఆర్ ప్రశ్నలు అడగ్గా.. అందుకు గోరటి వెంకన్న తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఇంటర్వ్యూకి ప్రారంభానికి ముందు గోరటి వెంకన్న ఆసక్తికర విషయం వెల్లడించారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చిందనేది రివీల్ చేశారు. కవిగా పాటలు పాడుతూనే.. కో ఆపరేటివ్ అసిస్టెంట్ సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా గోరటి వెంకన్న పని చేశారు. అయితే తనకు ఆగిపోయిన ప్రమోషన్ విషయమై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడేందుకు వెళితే.. తనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు చెప్పారు. తనకు పదవి రావటానికి గల కారణాలను వెల్లడిస్తూ అప్పటి విషయాలను మంత్రికి గుర్తు చేశారు.


'నేను ఎవరి దగ్గరికి పోను ఫ్లూయెంట్‌గా ఉండే మనిషిని. ఆ విషయం పెద్దాయనకు కూడా తెలుసు. దూరం దూరం ఉంటా.. సభలకు రాను. నేను మీ దగ్గరకు వచ్చి అన్న.. నా ప్రమోషన్ ఉంది. కో ఆపరేటివ్ అసిస్టెంట్ సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నా. 15 ఏళ్లయితుంది. ముందు రావాల్సిన ప్రమోషన్ లేట్ అయింది. అందరికీ ప్రమోషన్స్ వచ్చినయ్ అని ప్రమోషన్ కోసం వచ్చిన. మీరు ఉద్యోగం ఏం చేస్తారని ప్రమోషన బదులు ఎమ్మెల్సీ ఇచ్చారు. అది నేను కలలో కూడా ఊహించలేదు. వినమ్రంగా ఆ బాధ్యత తీసుకున్నా.' అని గోరటి వెంకన్న కేటీఆర్‌తో అన్నారు.


అందుకు కేటీఆర్.. మీకు ఆ పదవి రావటం అనేది ఆ పదవికే గౌరవమని చెప్పారు. శాసన మండలిలో మీరు సభ్యుడిగా ఉండటం వల్ల ఆ పదవికి మీ వల్ల గౌరవం వచ్చిందన్నారు. మీ వల్ల ఆ పదవికి అలంకారం వచ్చిందని చెప్పారు. అందుకు బదులిచ్చిన గోరటి వెంకన్న అదీ మీ గొప్పతనానని నిదర్శనమని చెప్పి ఇంటర్వ్యూలోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏమేమేం మార్పులు వచ్చాయి ? ఆ నాటికి ఈ నాటికి చెరువుల, నీళ్లలో వచ్చిన మార్పులు ఏంటి ? నాడు పల్లె కన్నీరు పెడుతోందన్న మీరు.. నేడు స్వపరిపాలనలో పల్లె ఏమంటోంది ? అంటే ఏం చెబుతారు. ఇలాంటి ప్రశ్నలకు గోరటి వెంకన్న సమాధానం ఇచ్చారు.


ఇక 5 రోజుల క్రితం ఈ ఇంటర్వ్యూ జరగ్గా.. తాజాగా ఇంటర్వ్యూపై కేసు నమోదైంది. వీరిద్దరితో కలిసి అమరవీరుల స్మారక ప్రాంగణంలో ఇంటర్వ్యూ నిర్వహించిన నిర్వాహకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు బుక్ చేశారు. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కనపడేలా షూటింగ్ చేశారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా.. నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM