తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డీఎంకే సపోర్ట్,,,,అధికారికంగా ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్

byసూర్య | Tue, Nov 21, 2023, 07:04 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరో తొమ్మిది రోజుల్లో అసలైన పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో.. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ.. అన్ని రాష్ట్రాల మద్దతు కూడగట్టుకున్న గులాబీ బాస్‌కు.. ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమంత్రి షాక్ ఇచ్చారు. జాతీయ పార్టీగా మారకముందు.. అన్ని రాష్ట్రాల సీఎంలతో సత్సంబంధాలు కొనసాగించిన కేసీఆర్.. వాళ్ల నివాసానికి వెళ్లటమే కాకుండా వాళ్లను కూడా ప్రగతిభవన్‌కు పిలిచి వింధులిచ్చి మద్దతు కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో కూడా పలుమార్లు భేటీ అయ్యారు కేసీఆర్. అంత సన్నిహితంగా ఉన్న కేసీఆర్‌కు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ మద్దతు ఇవ్వకపోవటమే కాకుండా.. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ప్రకటించారు.


తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డీఎంకే.. తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు.. స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని డీఎంకే సానుభూతిపరులకు సూచించారు. హస్తం పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. ఈ ప్రకటన వెనుక లోతైన కారణమే ఉంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా' కూటమిలోనూ భాగస్వామిగా ఉంది. తమిళనాడులోనూ డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు నడుస్తోంది. గత ఎన్నికల సమయంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. గత కొన్నేళ్లుగా యూపీఐలో ఉన్న చాలా పార్టీలు అటు ఇటూ అంటూ ఊగిసలాడుతున్నా.. డీఎంకే మాత్రం కాంగ్రెస్ వెంటే విశ్వననీయంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.


ఇదిలా ఉంటే.. స్టాలిన్ ప్రకటన ప్రభావం తెలంగాణలోని పలు నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా.. తెలంగాణలో తమిళ ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో తమిళులు.. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా స్థిరపడటం గమనార్హం. మల్కాజిగిరి, పద్మారావు నగర్, దయానంద్ నగర్, సఫిల్ గూడా, కైలాస్ గూడా, తిరుమలగిరి, కనాజీగూడా, అమ్ముగూడా, మెట్టుగూడా, తార్నాక, అల్వాల్, బొల్లారం, రెడిమెంటస్ బజార్.. లాంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తమిళులు స్థిరపడ్డారు. దీంతో.. స్టాలిన్ ప్రకటన ఆయా ప్రాంతాల ఫలితాలపై గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉంది.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM