కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో తేల్చేసిన కేసీఆర్,,,,మధిర ప్రజా ఆశీర్వాద సభలో చెప్పేసిన గులాబీ బాస్

byసూర్య | Tue, Nov 21, 2023, 07:00 PM

తెలంగాణ ఎన్నికలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. పోలింగ్‌కు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే.. ప్రచారానికి మాత్రం ఇంకా ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమంలో ప్రజా ఆశీర్వాద సభలతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన ప్రసంగాల్లో పదును పెంచారు. తమ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు విపక్షాలపై కూడా గట్టిగానే విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే.. మధిర సభలో పాల్గొన్న కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్నది కేసీఆర్ తేల్చేశారు. తెలంగాణ ఏర్పాడినప్పటి నుంచి జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా 21, 19 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి కూడా కాంగ్రెస్ 20 సీట్లే గెలుచుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పూర్తి మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని.. అందులో ఎలాంటి అనుమానం లేదని వెల్లడించారు. అయితే.. కాంగ్రెస్ పార్టీలో 12 మంది సీఎం అభ్యర్థులే ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.


అయితే.. తెలంగాణలో గతం కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. అటు సర్వేలతో పాటు ఇటు నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో.. హస్తం పార్టీనే అధికారం చేపట్టనుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. గతంలో కాంగ్రెస్‌ 19 సీట్లు గెలుచుకోగా.. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. అయితే.. వాళ్లంతా కూడా ఈసారి గులాబీ పార్టీ తరపున బరిలోకి దిగారు. అయినా కూడా 20 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్తుండటం.. సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


సీఎం కేసీఆర్ మాటలను బట్టి కూడా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పుంజుకుందన్నది తెలుస్తోంది. ఆయనే స్వయంగా 20 సీట్లు వస్తున్నాయని చెప్తుండగా.. క్షేత్రస్థాయిలో చూస్తుంటే మరో 20 సీట్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదన్నది సాధారణ జనాలు చర్చించుకుంటున్నారు. మరి చూడాలి.. కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్టు అధికారం చేపడతారా.. కేసీఆర్ చెప్పినట్టు 20 సీట్లకే పరిమితం అవుతారా.. సామాన్యుల అంచనా ప్రకారం 40 సీట్ల వరకు వస్తాయా..?


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM