byసూర్య | Tue, Nov 21, 2023, 02:03 PM
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అన్నివిధాలుగా భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.