byసూర్య | Tue, Nov 21, 2023, 01:37 PM
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ స్టాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పీఎస్ పరిధిలో షాద్ నగర్ పట్టణం శ్రీరాంనగర్ కు చెందిన వీణ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నారు. సోమవారం మధురానగర్ లోని తిరుమల ఉమెన్స్ హాస్టల్ లో చేరారు. అయితే వీణ లంచ్ కు రాకపోవడంతో హాస్టల్ నిర్వహకులు వెళ్లి చూడగా గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.