కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవుతాం: హరీశ్‌రావు

byసూర్య | Tue, Nov 21, 2023, 01:30 PM

కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ ఆగమవుతామని రాష్ట్రమంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. మూడు గంటల కరెంట్ ఇస్తే 3ఎకరాలు పారుతుందని రేవంత్‌, రైతుబంధు పెట్టి దుబారా ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్‌ అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు జీరో అవుతుందని హెచ్చరించారు. వంద అబద్ధాలు ఆడైనా కుర్చీ సాధించాలనేదే కాంగ్రెస్ విధానమని హరీశ్‌రావు ఆరోపించారు.


బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని దుబ్బాకలో మంత్రి హరీష్‌రావు అన్నారు. 'బీజేపీపై సొంత పార్టీ నాయకులకే నమ్మకం లేదు.. బీజేపీ తెలంగాణలో గెలవదని తెలిసి రోజుకో నాయకుడు పార్టీ వీడుతున్నారు. విజయశాంతి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ లాంటి నాయకులు పార్టీకి టాటా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారెంటీలు నెరవేర్చలేదు.. కానీ, ఇక్కడ 6 గ్యారెంటీలు అంటోంది' అని అన్నారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM