byసూర్య | Tue, Nov 21, 2023, 01:19 PM
డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందిన ఘటన తలకొండపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన నామని ఈశ్వరమ్మ, పర్వతాలు కొడుకు నవీన్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తున్న క్రమంలో నవీన్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అనారోగ్యం పాలైన అతను 3 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.