ఒకే పేరుతో వేర్వేరు అభ్యర్థులు

byసూర్య | Tue, Nov 21, 2023, 01:13 PM

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాట ఓ పజిల్‌గా మారనుంది. ప్రధాన అభ్యర్థులకు పోటీగా అదే పేరున్న వ్యక్తులు స్వతంత్రులుగా ఆయా చోట్ల పోటీ చేస్తుండడమే అందుకు కారణం. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌(బీఆర్ఎస్), ఏ.అజయ్‌(స్వతంత్ర), కే.అజయ్‌(స్వతంత్ర), కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి(బీఆర్‌ఎస్), ప్యాట నరేందర్‌రెడ్డి(స్వతంత్ర), నారాయణపేటలో ఎస్‌.రాజేందర్‌రెడ్డి(బీఆర్‌ఎస్), కె.రాజేందర్‌రెడ్డి(స్వతంత్ర)లు బరిలో నిలిచారు.


అసెంబ్లీ పోలింగ్ కు ముందు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్, బార్ లు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM