byసూర్య | Tue, Nov 21, 2023, 01:08 PM
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఈ నెల19 ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన కుడికిల్ల గ్రామానికి చెందిన కొండ్ర చంద్రయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయ్య దగ్గర రూ. 2లక్షలు ఉండాలని, విషయాని గమనించిన దుండగులే ఆయనను కొట్టి చంపి పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.