సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు: మంత్రి కేటీఆర్

byసూర్య | Tue, Nov 21, 2023, 12:42 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్ షోలో ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనారు.


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా ఉప్పల్ రింగ్ రోడ్డులో నిన్న సాయంత్రం కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల ఇన్ చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM