byసూర్య | Tue, Nov 21, 2023, 12:39 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని సోమవారం నకిరేకల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కొరకు కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరైనారు.