byసూర్య | Tue, Nov 21, 2023, 11:18 AM
రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఎక్కుపెడుతున్న విమర్శలను తిప్పికొడుతోంది. ఈ వారం రోజుల్లో70 నియోజకవర్గాలలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారంలో పాల్గొననున్నారు. 25 నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఆయన గొంతు ఒక ధిక్కార స్వరం. ఆయన మాట బడుగులకు దారిచూపే బాట. ఆయన చేయి నిస్సహాయులను ఆదరించే ఆపన్నహస్తం. ఆయన అడుగు అసహాయులకు పోరుమార్గాన్ని చూపే దిక్సూచి. అన్యాయం జరిగిందన్న విషయం తెలిస్తే.. అగ్గిరాజేసే నిప్పుకణిక ఆయన. ఆ జ్వలించే అగ్నికణమే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆయనపై రూపొందించిన డాక్యుమెంటరీని పైనున్న ప్లే బటన్ నొక్కి చూసేయండి.