byసూర్య | Tue, Nov 21, 2023, 10:55 AM
మాదాపూర్లోని శిల్పారామంలో సోమవారం కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య కళారూపాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలల పండుగ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు చూడ ముచ్చటైన శాస్త్రీయ నృత్యాలతో కనువిందు చేశారు. నాట్య గురువులు డా. రమాదేవి, రమణిసిద్ధి, అరుణశ్రీనివాస్, దుర్గేష్ నందిని శిష్యబృందం చక్కటి హావభావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు నయనానందకరంగా సాగింది.