![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 10:59 AM
తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో భాగంగా జరిగిన ఎన్నో కార్యక్రమాలలో పాలుపంచుకున్న ముదిరాజుల ఆత్మ గౌరవ ప్రతీకగా జాతి జెండాను రూపొందించుకొని నవంబర్ 21- 2014 రోజున ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీరంతా వేలాదిమందిగా తరలివచ్చి దీవించిన శుభముహూర్తములో అందరి సమక్షంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించడం జరిగింది.
యావత్ జాతి గుండెల్లో నిలిచింది. భారతదేశ స్వాతంత్ర్య అనంతరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ముదిరాజ్ బిడ్డల ఆర్తనాధానాలను, ఆకలి కేకలను అంతమొందించాలనే లక్ష్యంతో గత 9 సంవత్సరాల కాలంలో సాధించినవి ఎన్నో ఉన్నప్పటికీ మరెన్నో సాధించాల్సిన బాధ్యత మనపై ఉన్నది,కావున తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను,ఎజెండాను మరింత బలంగా ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆ బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డపై ఉన్నది కాబట్టి ఈనెల 21వ తేదీన జరగబోయే తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రతి గ్రామ గ్రామాన, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, యావత్ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ ఆత్మబావుటా ఎగురవేసే విధంగా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి, సంబరాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాను* *మీ తోడేటి సత్యం ముదిరాజ్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి స్టేట్ వైస్ ప్రెసిడెంట్