byసూర్య | Tue, Nov 21, 2023, 10:49 AM
కాంగ్రెస్ పార్టీ సేవలే నన్ను గెలిపిస్తాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బోధన్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ మండలంలోని పెంటాఖుర్థు, పలు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునేదే కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు సూచించారు. చేయి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలుపొందించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.