byసూర్య | Tue, Nov 21, 2023, 10:42 AM
అసెంబ్లీ పోలింగ్ కు ముందు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్, బార్ లు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.