byసూర్య | Tue, Nov 21, 2023, 08:54 AM
ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క సోమవారం అర్ధరాత్రి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విజయ్‌భాస్కర్‌తో మాట్లాడి.. అక్కడే బైఠాయించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెకు ఫోన్ చేసి ఆరా తీశారు. రాత్రి 2 గంటలు దాటినా సీతక్క ఆందోళన కొనసాగింది.