మరో వ్యక్తితో భార్య కాపురం,,,తట్టుకోలేక భర్త సూసైడ్

byసూర్య | Mon, Nov 20, 2023, 11:36 PM

తెలుగులో విడుదలైన ఆరుగురు పతివ్రతలు సినిమా చూశారా ? అందులో ఓ పెళ్లయిన మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. భర్తకు తెలియకుండా అతడితో సన్నిహతంగా ఉంటుంది. ఓ రోజు భర్తకు విషయం తెలిసి.. ఇంట్లో వారు ఓ ఒప్పందానికి వస్తారు. భర్త, ప్రియుడితో కలిసి ఆమె ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. అచ్చం దాదాపుగా అలాంటి సీన్ ఖమ్మం జిల్లాలో రిపీట్ అయ్యింది. కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరు కాపురం పెట్టి భర్తనూ కూడా తనతో పాటు కలిసి ఉండాలని కండీషన్ పెట్టింది. దీంతో తీవ్ర మసన్థాపానికి గురైన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గుండాల వంశీ (29)కి ఐదేళ్ల క్రితం మండలంలోని గోకినేపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. సంతోషంగా సాగిపోతున్న సంసారం. అయితే.. భార్య భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతడితోనే ఉంటూ వేరు కాపురం పెట్టింది. ఈ విషయమై భర్త వంశీ పలుమార్లు హెచ్చరించినా ఆమె తీరు మార్చుకోలేదు. తన వద్దకు వచ్చేయాలన్న ఒప్పుకోలేదు. ప్రియుడిని విడిచిపెట్టలేనని తెగేసి చెప్పింది.


పైగా. భర్తనూ కూడా తమతో కలిసి ఉండాలని సూచించింది. ఆమె కండీషన్‌ను తట్టుకోలేని భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మరో వ్యక్తితో భార్య కలిసి ఉండటమే కాకుండా.. అదే ఇంట్లో తనను కూడా ఉండాలని చెప్పటంతో వేదనకు గురయ్యాడు. ఇక తాను జీవించి లాభం లేదనుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. మృతుడి తండ్రి గుండాల శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM