మానకొండూరు సభలో కొత్త స్కీం ప్రకటించిన సీఎం కేసీఆర్,,,,ఆటోవాలాలకు ఫిట్‌నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు

byసూర్య | Mon, Nov 20, 2023, 08:44 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులు, మేనిఫెస్టోను ప్రకటించిన గులాబీ బాస్.. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రజాశీర్వాదసభల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పాలన, పథకాలను ప్రజలకు వివరించటమే కాకుండా..ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ మనకొండూరు సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఆటో నడిపి జీవనం సాగించే వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సభా వేదికగా కొత్త స్కీం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తొలిసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆటోలకు ట్యాక్స్‌లు రద్దు చేశామని.. రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్యాసింజర్ ఫిట్‌నెస్ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఫిట్‌నెస్, పర్మిట్ కోసం రూ. 1200 వరకు ఖర్చవుతుందని.. ఆ డబ్బులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.


'కరీంనగర్‌కు నాకూ ఏదో లింకు ఉన్నది. మా కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ కూడా అదే అన్నరు. నేను ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్ వచ్చిన ప్రతిసారీ.. ఎదో ఒక కొత్త స్కీం ప్రకటిస్తా. ఈ సభా వేదికగా ప్రకటిస్తున్నా.. ఆటో నడిపి జీవనం సాగించేవారికి ఇది గుడ్‌న్యూస్. మేం మూడోసారి అధికారంలోకి రాగానే.. ఫిట్‌నెస్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం. అని కేసీఆర్ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెబుతున్నారని.. అది భూమాత కాదని భూమేత అని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాతరోజులు వస్తాయని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. కరెంట్‌పై పీసీసీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనకు వ్యవసాయంపై ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. ఎన్నో పోరాటాలు, బలిదానాల ద్వారా సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.


Latest News
 

తెలంగాణ‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు Sat, Dec 09, 2023, 11:14 AM
బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ Sat, Dec 09, 2023, 11:13 AM
రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం Sat, Dec 09, 2023, 11:11 AM
సింగరేణి కార్మికుడిగా అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ Sat, Dec 09, 2023, 11:09 AM
శాంతిఖని గని కార్మికుల పాత్ర కీలకం Sat, Dec 09, 2023, 11:08 AM