byసూర్య | Mon, Nov 20, 2023, 02:54 PM
కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సిద్ధ రామయ్య ఆద్వర్యంలో పక్కాగా అమలు చేస్తోందని కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నాగరాజు స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదనే దుష్ప్రచారాలను ఖండించారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు తమ్మడబోయిన ఓదెలు, సందనవేన రాజేందర్, గుండెటి ఐలయ్య, పాల్గొన్నారు.