byసూర్య | Mon, Nov 20, 2023, 02:40 PM
కల్వకుర్తి మండల పరిధిలోని బెక్కెర గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ఓటు హక్కు చైతన్యంపై అవగాహన కలిగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైందని ప్రతి ఐదేళ్ల కు ఒకసారి వచ్చే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి మాకు బంగారు భవితను అందించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘురామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.