ఆ ముగ్గురూ నాకు దోస్తులే.. లోకేష్ ఫోన్ చేసి మరీ అడిగాడు.. కేటీఆర్

byసూర్య | Tue, Sep 26, 2023, 07:04 PM

ఏపీలో సంచలనంగా మారిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అక్కడి రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతుంది.. కేవలం రెండు రాజకీయ పార్టీలకు మధ్య జరుగుతున్న వ్యవహారమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాలకు.. తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదన్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్టయితే.. తెలంగాణలో ర్యాలీలు తీయటమేంటని ప్రశ్నించారు. రాజమండ్రిలో దద్దరిల్లేలా ర్యాలీలు తీసుకోలాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దనే ఉద్దేశంతోనే.. ధర్నాలు, ర్యాలీలకు అనుమతివ్వలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని విజయవాడ, అమరావతి, రాజమండ్రి ఇలా ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు తీసుకోవాలని.. తమకేమీ అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. కానీ.. ఇక్కడ ర్యాలీలు చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు.


తనకు జగన్, పవన్, లోకేష్.. ముగ్గురూ స్నేహితులేనని చెప్పిన కేటీఆర్.. ఎవ్వరితో ఎలాంటి విభేధాలు లేవని చెప్పుకొచ్చారు. ఇక్కడ ర్యాలీలకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేసి మరీ అడిగారని తెలిపిన కేటీఆర్.. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే అనుమతివ్వలేదని స్పష్టంగా చెప్పినట్టు తెలిపారు కేటీఆర్. చంద్రబాబు విషయం కోర్టులో ఉందని.. ఆయన న్యాయపోరాటం చేస్తున్నారని తెలిపారు. దానికి.. హైదరాబాద్‌లో ర్యాలీలు చేసి ఇక్కడి వాతావరణాన్ని దెబ్బతీయటం ఎంత వరకు కరెక్టంటూ ప్రశ్నించారు కేటీఆర్.


హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలకు చెందిన వారు విధులు నిర్వహిస్తున్నారని.. అందులో ఏపీ, కర్ణాటక, తమిళినాడు ఇలా ఎంతో మంది ఉన్నారని తెలిపారు కేటీఆర్. ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారన్నారు. ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉంటున్నారని.. అలాంటి వారికి కక్షలు కార్పణ్యాలు అంటింద్దామని చూస్తే ఊరుకోమని చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఏం చేసినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు కేటీఆర్.


Latest News
 

కేసీఆర్ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని వెల్లడి Thu, Oct 31, 2024, 10:33 PM
మూసీ ప్రాంతంలో కేసీఆర్, ఈటల రాజేందర్ ఉండాలన్న కాంగ్రెస్ నాయకులు Thu, Oct 31, 2024, 07:05 PM
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు Thu, Oct 31, 2024, 05:21 PM
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ Thu, Oct 31, 2024, 05:19 PM
మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ Thu, Oct 31, 2024, 05:16 PM