byసూర్య | Tue, Sep 26, 2023, 01:24 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, ఉప్పునుంతల మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘం నాయకులు పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను ఉస్మరించుకున్నారు. ఐలమ్మ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో హక్కుల కోసం పోరాడుతామని రజక సంఘం నాయకులు అన్నారు.