byసూర్య | Tue, Sep 26, 2023, 01:22 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు పురపాలకలో మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళలర్పించారు. భూమి లేకపోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇటిక్యాల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు సురేష్, కార్యదర్శులు రాముడు తదితరలు పాల్గొన్నారు.