byసూర్య | Tue, Sep 26, 2023, 01:22 PM
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. ఆమె తన అధికారాలు ఉపయోగించి తప్పులను తప్పూ అంటే రాజకీయాలు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవినీతిపరమైన బిల్లులకు ఆమోదం తెలిపితే గవర్నర్ మంచి వారు అని, అలా చేయకపోతే ఆమె చెడ్డవారని ముద్ర వేస్తున్నారని విమర్శించారు.