హైదరాబాద్‌లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం,,,చిన్నారులు, వృద్ధుల్లో తీవ్ర లక్షణాలు

byసూర్య | Mon, Sep 25, 2023, 07:52 PM

హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధులు బెంబెలిత్తిస్తున్నాయి. వాతావరణ మార్పులతో డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యూ వంటి వ్యాధులతో ఇప్పటికే నగరంలోని ఆసుపత్రిలు నిండిపోతున్నాయి. దాదాపు 1500 మంది డెంగీ జ్వరాలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇదిలా ఉండగానే మరో వ్యాధి ప్రజల్ని భయాందోళలకు గురి చేస్తుంది. నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలు, వయస్సు మళ్లిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు. చాలా కేసుల్లో ఒకే సారి డెంగీ, టైఫాయిడ్ లేదా డెంగీ, స్క్రబ్ టైఫస్ వ్యాధులను కనుగొన్నట్లు చెప్పారు. ఇలా రెండూ ఒకేసారి అటాక్ చేయటం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అంటున్నారు.


అంకురా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, చిన్న పిల్లల డాక్టర్ దుర్గా ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం..' డెంగీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన కారణం.. రోడ్లపై, నీటి తొట్టిలలో వర్షపు నీరు నిల్వ ఉండటం, టైగర్ దోమల వృద్ధి. డెంగీ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కనిపించినప్పటికీ స్క్రబ్ టైఫస్ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రెండూ ఇప్పుడు నగరంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సిటీకి తిరిగి రావటం, కొందరు ట్రెక్కింగ్‌కు వెళ్లటం ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం.' అని ఆయన వెల్లడించారు.


వ్యాధి లక్షణాలు..


స్క్రబ్ టైఫస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల సోకుతుందని చెప్పారు. ఇవి ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయని చూడటానికి ఆ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయన్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, నీరసంగా ఉండటం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధిని నివారించడానికి టీకాలు లేవని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కాబట్టి ఇన్‌ఫెక్షన్ సోకిన వారికి దూరంగా ఉంటటం మేలని చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి చేతులు, కాళ్లకు కప్పి ఉంచేలా దుస్తులును ధరింపచేయాలని సూచిస్తున్నారు. దొమ తెరలను ఉపయోగించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM