తెలంగాణ ఎన్నికల్లో యువతే కీలకం,,,అభ్యర్థుల గెలుపోటముల వారి చేతుల్లోనే

byసూర్య | Mon, Sep 25, 2023, 07:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండగా.. వచ్చే నెల మెుదటి వారంలో షెడ్యుూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులకు చేర్పులకు అవకాశం కల్పించింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యం యువత చేతిలో కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. పార్టీల గెలుపోటములను వారే నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది.


తాజా ఎలక్టోరల్ రోల్ డేటా ప్రకారం ఈసారి ఏడు లక్షల మంది యువత తొలిసారి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తెలంగాణలోని మెుత్తం ఓటర్ల సంఖ్య 3.14 కోట్లు కాగా.. వారిలో 35 ఏళ్లలోపు ఓటర్లు 30 శాతం మంది ఉన్నట్లు తేలింది. 18-19 ఏళ్ల మధ్య వయస్కులు దాదాపు ఏడు లక్షల మంది ఉన్నారు. 19-35 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు 75 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఇలా యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున చాలా సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు యువమంత్రాన్ని జపిస్తున్నారు. వారిని ఆకర్షించడానికి ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడేందుకు యువ నాయకులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన కొందరు నేతలు.. ఎక్కువగా యువకులను కలుస్తూ ఆదరించాలని కోరుతున్నారు.


అన్ని పార్టీలు కొలువులపై ఫోకస్ చేసి ప్రచారాలు సాగిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ తాము లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండగా.. టీఎస్‌పీపీఎస్సీ వైఫల్యం మెుదలైన అంశాలను ప్రతిపక్షాలు తమ ఎన్నికల అస్త్రాలుగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 'యూత్ డిక్లరేషన్'ను ప్రకటించింది. తమ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది.


బీజేపీ కూడా యువతను ఆకర్షించేదుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే టెన్త్ పేపర్ లీక్, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన విషయంలో ఆందోళనలు చేపట్టింది. నరేంద్ర మోదీ ద్వారానే యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన G20 సమ్మిట్, చంద్రయాన్-3 విజయవంతం కావటంపై యువతలో బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడగా.. దాన్ని ఓట్లుగా మలుచుకోవాలని నేతలు యత్నిస్తున్నారు. యువత కోసం అగ్నివీర్, మేక్ ఇన్ ఇండియా వంటి యువతకు మేలు చేసే అనేక అంశాలు ఉన్నాయి వారి మద్దకు పూర్తిగా మాకే ఉంటుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. ఇలా అన్ని పార్టీలు యువతను టార్గెట్ చేయగా.. వారు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి మరి.


Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM