చెరువులో మునిగి నలుగురు మృతి,,,మృతుల్లో ఒక బాలుడు, నలుగురు మహిళలు

byసూర్య | Mon, Sep 25, 2023, 07:15 PM

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి మొత్తంగా నలుగురు చెరువులో మునిగి ప్రాణాలు విడిచారు. రంగయ్యపల్లిలో బోనాల పండుగ జరుపుకుంటుండగా.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన దొడ్డు బాలమణి (30), తన కుమారుడు చరణ్ (10), తన తోటికోడలు లక్ష్మి (25) తో కలిసి బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే బట్టలు ఊతుక్కునేందుకు గ్రామంలోని చెరువు దగ్గరికి.. బంధువుల అమ్మాయి ఫిరంగి లక్ష్మి (25) తో కలిసి వెళ్లారు. మహిళలు చెరువు ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా.. బాలమణి కుమారుడు చరణ్.. చెరువులో స్నానానికి దిగాడు. అయితే.. ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో మునిగిపోయాడు.


కళ్ల ముందే మునిగిపోతున్న తన కొడుకుని చూసి.. కాపాడుకోవాలనే కంగారులో బాలామణి కూడా చెరువులోకి దూకింది. అయితే.. ఆమెకు కూడా ఈత రాకపోవడంతో.. ఇద్దరు మునిగిపోసాగారు. అది చూసిన లక్ష్మి, లావణ్య.. సహాయం కోసం అరిచినా.. ఎవ్వరూ లేకపోవటంతో వాళ్లే చెరువులోకి దిగి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. విధి చాలా కఠినమైనది.. కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు కూడా చెరువులో పడిపోయారు. ఎవ్వరికీ ఈత రాకపోవటంతో.. నలుగురూ చెరువులో మునిగిపోయారు.


కాసేపటికి వీళ్లను వెతుక్కుంటూ వచ్చిన బంధువులు.. వారి చెప్పులు, బట్టలు చెరువు ఒడ్డుపైన ఉండటం చూసి.. చెరువులోకి దూకి వెతికారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. మరోవైపు.. పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే.. ఆ నలుగురి కోసం ఆరుగురు గజ ఈతగాళ్లు రెండు గంటల సేపు గాలించారు. కాగా.. ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యం కాగా.. చాలా సేపు గాలించిన తర్వాత బాలుడి మృతదేహం లభించింది. ఈ విషయం తెలిసి.. ఆ నలుగురి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నలుగురు ఒకేసారి మరణించటంతో.. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాపాడేందుకు వెళ్లగా.. వాళ్లు కూడా చెరువులో మునిగి చనిపోవటం అందరినీ కలచివేసింది.



Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM