అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే

byసూర్య | Fri, Sep 22, 2023, 08:04 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక మండపాల దగ్గర భక్తుల రద్దీ మామూలుగా ఉండట్లేదు. ఇక ఖైరతాబాద్‌లాంటి మహాగణపయ్య దగ్గర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఇలాంటి ప్రాంతాల్లో కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. సందు చూసి.. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కావాలనే అమ్మాయిలు, మహిళలను అసభ్యకరంగా తాకుతూ.. శునకానందం పొందుతున్నారు. రద్దీలో ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నారు కానీ.. వాళ్ల ప్రతీ కదలికను నిఘా నేత్రాలు గమనిస్తుంటాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడే కాదు.. బస్సులు, మార్కెట్లు, ఏదైనా ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో అందరూ బిజీగా ఉంటే.. ఇలాంటి ఆకతాయిలు మాత్రం వాళ్ల పనిలో వాళ్లుంటారు. అయితే.. ఇంతమంది జనాల్లో తమను ఎవరు గమనిస్తారులే అని బరితెగించే పోకిరీలకు హైదరాబాద్ సిటీ పోలీసులు షాక్ ఇచ్చారు. 


జనాలు ఎక్కువగా గుమిగూడిన ప్రాంతాల్లో అమ్మాయిలను కావాలని అసభ్యకరంగా తాకుతున్న అకతాయిల దృశ్యాలను "షీ టీమ్స్" చిత్రీకరించి.. వాళ్లందరినీ శ్రీకృష్ణజన్మస్థలానికి పంపిస్తున్నారు. మచ్చుకు ఓ వీడియోను కూడా పోలీసులు వదిలారు. షీ టీంకు సంబంధించిన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. "మీ అన్ని కదలికలను గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి." అంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇకపై అమ్మాయిలపై చెయ్యేస్తే జైలు తప్పదంటూ వార్నింగ్ ఇవ్వటంతో.. ఆకతాయిలకు మూడినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే.. నగరంలో అమ్మాయిలు, మహిళలను రోడ్లపై ఈవ్ టీజింగ్ చేస్తున్న ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షీ టీమ్స్ వచ్చిన తర్వాత.. రోడ్లపై అమ్మాయిలను వేధించే ఆకతాయిల బెడద చాలా వరకు తగ్గింది. ఈ క్రమంలోనే.. ఇలా సందు చూసి వికృత చేష్టలకు పాల్పడుతున్న వారికి కూడా గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు పోలీసులు.



Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM