ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ

byసూర్య | Fri, Sep 22, 2023, 07:58 PM

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కీలక నేతలు సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ కూడా కీలక ప్రకటన చేశారు. అయితే.. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎలక్షన్‌ అని.. ఆ తర్వాత తాను పోటీ చేస్తానో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఇందుకు కారణం ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకోవటం కాదండోయ్.. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావటమేనటా. అయితే.. మహిళా బిల్లు అమల్లోకి వస్తే.. ఖమ్మం అసెంబ్లీ స్థానం ఒకవేళ మహిళ రిజర్వ్‌డ్ అయితే.. ఇవే తనకు చివరి ఎన్నికలు అయితయేమోనని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.


ఒకవేళ ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్ అయితే తమ ఇంట్లో నుంచి ఎవ్వరినీ నిలబెట్టనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పార్టీ కోసం పని చేసిన మహిళలే పోటీలో ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. మహిళల కోసం మనమంత ముందు పడాలన్నారు. మంత్రి కేటిఆర్ చెప్పినట్లు తన స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పదవి లేకపోయినా సరే.. తాను ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేయటం మాత్రం కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు మంత్రి పువ్వాడ.


రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అజయ్ కుమార్.. విపక్షాలపై విమర్శలు చేశారు. ఎవరెవరో వచ్చి దండాలు పెట్టి మళ్లీ మాయమైపోతారంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం అభివృద్దిని సాదుకోవాలో చంపుకోవాలో ప్రజలే నిర్ణయించాలని సూచించారు. కళ్లబొల్లి మాటలు చెప్పేవారు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని.. ఎన్నికలు అయిపోగానే మాయమైపోతారంటూ పేర్కొన్నారు. నిత్యం ప్రజల వెంట ఉండేది అజయ్ అన్న మాత్రమేనని చెప్పుకొచ్చారు. మూడో సారి తనను ఆశీర్వదించి.. మరో ఐదేళ్లు నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


Latest News
 

మానవత్వం చాటుకున్న కేటీఆర్ Wed, May 22, 2024, 01:44 PM
భార్యను చంపిన భర్త Wed, May 22, 2024, 01:40 PM
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM