సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి పిల్లలు.. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డ జనం

byసూర్య | Fri, Sep 22, 2023, 05:49 PM

వనాలను విడిచి వన్యప్రాణులు ఊళ్లలోకి ఎంటరవుతూ.. జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు అటవీ ప్రాంతాలైన తిరుపతి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ములుగు లాంటి జిల్లాల్లోనే వన్యప్రాణుల సంచారం ఎక్కువగా కనిపించేది. కానీ.. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ క్రూర మృగాలు కనిపిస్తూ.. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు కోతులు, కొండముచ్చులే అనుకుంటే.. ఇప్పుడు చిరుతలు, ఎలుగు బంట్లు కూడా యథేచ్చగా జనారణ్యాల్లోకి వస్తున్నాయి. అయితే.. రాజన్న సిరిసిల్లలో జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతుంది. సంచారమమే కాదు.. రెండు పిల్లలకు జన్మనిచ్చింది కూడా. గురువారం రాత్రి సమయంలో.. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఓ చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.


అయితే.. ఒక పిల్లను చిరుత తన నోట కరచుకుని తీసుకువెళ్తుండగా.. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న ఓ రైతు చూశాడు. ఈ విషయాన్ని వెంటనే గ్రామస్థులకు చేరవేశాడు. ఇంకేముందు.. చిరుత అంటే గజగజా వణికే జనాలు.. చిరుత పిల్లను చూసేందుకు మాత్రం ఎగబడిపోయారు. ఆ ఊర్లో వాళ్లే కాదు.. పక్క ఊళ్ల నుంచి కూడా జనాలు తరలివచ్చి.. చిరుత పిల్లలో ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని.. ఆ బుజ్జి చిరుత పిల్లను కరీంనగర్‌కు తరలించారు. మరోవైపు.. తల్లి చిరుత మళ్లీ ఆ ప్రదేశంలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM