రెండు, మూడు రోజుల్లో ఏ పార్టీ అనేది క్లారిటీ ఇస్తా,,,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

byసూర్య | Fri, Jun 09, 2023, 09:36 PM

కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఓ పార్టీలో చేరతానని బీఆర్ఎస్ నేతలు ఊహించారని, మందుపార్టీలు కూడా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మారిన తన వ్యూహంతో ఇప్పుడు వాళ్లకు నిద్రపట్టట్లేదని తెలిపారు. ఏ పార్టీలో ఎప్పుడు చేరతాననేది అధికారికంగా హైదరాబాద్‌లో ప్రకటిస్తానన్నారు. తన టార్గెట్ బీఆర్ఎస్ ఓటమేనని పేర్కొన్నారు.


బీఆర్ఎస్‌కు వడ్డీతో సహా ఇచ్చిపడేసే సమయం వచ్చిందని, ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని పొంగులేటి చెప్పారు. ఉమ్మడి ఖమ్మంలో వేలాదిమంది అభిప్రాయాలు తీసుకున్నానని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ పేరు, చేరే తేదీని చెబుతానని స్పష్టం చేశారు.


ఇవాళ ఖమ్మంలో ముఖ్య అనుచరులతో పొంగులేటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై చర్చలు జరిపారు. ఈ చర్చ అనంతరం ఏ పార్టీలో చేరాలనే దానిపై పొంగులేటి తుది నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు పొంగులేటి కీలక భేటీ, మరోవైపు నేడు ఖమ్మంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉండటంతో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు బండి సంజయ్ ఖమ్మంకు వచ్చారు. ఖమ్మంలో పట్టు సంపాదించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం జాతీయ నేతలతో భారీ సభలకు ప్లాన్ చేస్తోంది. దాదాపు లక్షమందితో అమిత్ షా సభకు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోన్నారు.


ఇక ఈ నెలలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంకగాంధీ ఖమ్మం రానున్నారని తెలుస్తోంది. ఈ సందర్బంగా నిర్వహించే బహిరంగ సభలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరికొంతమంది కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ఈ నేతల చేరికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడనుంది. తమ వెంట ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేలా పొంగులేటి, జూపల్లి సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో కొంతమంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలొస్తున్నాయి. రెండు నెలల క్రితం పొంగులేటి, జూపల్లిని బీఆర్ఎస్ నుంచి సప్పెండ్ చేయగా.. అప్పటినుంచి వారిద్దరూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఒక దశలో కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనకు కూడా వచ్చారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారు.



Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM