చేప మందు పంపిణీ తో రద్దీ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు

byసూర్య | Fri, Jun 09, 2023, 09:37 PM

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆస్తమాతో బాధపడేవారికి చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.


ఎంజే మార్కెట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వచ్చే వాహనదారులను అబిడ్స్, నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు దారి మళ్లించనున్నారు. ఇక ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అలాస్కా వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపు మళ్లించనున్నారు. పిసిఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.


ఇక చేప ప్రసాదం తీసుకునేందుకు నాంపల్లి వైపు నుంచి ఫోర్ వీలర్స్‌పై వచ్చేవారు గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ వద్ద తమ వాహనాలను పార్క్ చేసి అజంతా గేట్ లేదా గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు కాలినడకన వెళ్లాలి. ఇక ఎంజే మార్కెట్ వైపు నుంచి ఫోర్ వీలర్స్‌పై వచ్చేవారు ఎంఏఎం వద్ద తమ వాహనాలను పార్క్ చేయాలి. ఇక ఎంజే మార్కెట్ నుంచి బస్సలు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీ భవన్ బస్టాఫ్‌లో, నాంపల్లి వైపు నుంచి బస్సులు, వ్యాన్‌లలో వచ్చే వ్యక్తులు గృహకల్ప బస్టాఫ్‌లో దిగి అజంతా గేట్ ద్వారా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి వెళ్లాలి. వ్యాన్లకు గోషామహల్ పోలీస్ స్టేడియంలో పార్కింగ్ అవకాశం కల్పించారు.


ఎంజే మార్కెట్ వైపు నుంచి బైక్‌లపై వచ్చేవారు భీమ్‌రావ్ బడా పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసుకోవాలి. నాంపల్లి నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలకు గృహకల్ప నుంచి బీజేపీ ఆఫీస్ మధ్య పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇక షెజాన్ హోటల్, భవానీ వైన్స్, పాత జువెనైల్ కోర్టు, ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించారు. కాగా శుక్రవారం ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బత్తిని హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో తరతరాలుగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. చేప మందు కోసం గురువారం సాయంత్రానికే వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మందికిపైగా ఆస్తమా బాధితులు వచ్చారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు.



Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM