ప్రతి పోలీస్ అధికారి తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

byసూర్య | Thu, Jun 08, 2023, 12:10 PM

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఐ. పి. యెస్ జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఐపిఎస్ మాట్లాడుతూ.. గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు కోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు.

ప్రతి అధికారికి పూర్తి స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి, ఆర్ఐ నాగేశ్వర్ రావ్, ఎస్బిసి. ఐ. దిలీప్ కుమార్, డిసిఆర్బిసిఐ సూర్య ప్రకాష్, జిల్లా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM