పూర్వ చెరువుల పండుగను విజయవంతం చేయాలి

byసూర్య | Thu, Jun 08, 2023, 12:11 PM

ఎన్నికలలో ఎంత భాద్యతాయుతంగా విధులు నిర్వహిస్తామో అంతే బాధ్యతతో అధికారులు టీం స్పిరిట్ తో పనిచేసి ఊరూరా చెరువుల పండుగను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం ట్యాంక్ ప్రత్యేకాధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓ లు, ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ (ట్యాంక్) చెరువుల ప్రత్యేకాధికారులు రాత్రి అక్కడే బస చేసి చేరు పరిసర ప్రాంతాలను సభాస్థలికి అనుకూలంగా చదును చేసి, చక్కటి లైటింగ్, డీజే సౌండ్ ఏర్పాటు చేయాలని, గోరెటి వెంకన్న పాటలు వినిపించాలన్నారు. బోనాలు, బతుకమ్మలతో సాయంత్రం 5 గంటల వరకు కోలాహాలంగా చెరువు కట్టకు చేరుకునేలా జన సమీకరణ చేయాలని, రంగోలి, పూలతో అలంకరించాలని, కట్ట మైసమ్మ వద్ద పూజలు నిర్వహించాలని అన్నారు.

మంచినీటి సౌకర్యం, రాత్రి భోజనం ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులు అందజేశామని, అవసరమైతే గ్రామంలోని దాతల నుండి తగు ఏర్పాట్లకు సహకారం తీసుకోవాలన్నారు. చెరువులు లైన్ కొన్ని గ్రామా పంచాయతీలకు ప్రక్క పంచాయతీ లోని చెరువులు/కుంటల వద్ద వేడుక జరుపుకునేలా ఏర్పాట్లు చేశామని, అక్కడి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ప్రతి చెరువు వద్ద 2 నుండి 4 గజ ఈతగాళ్లను నియమిచ్చామని, పెట్రోలింగ్ కు పోలీసులతో సమన్వయము చేసుకోవలసినదగా గ్రామా, మండల అధికారులకు సూచించారు. తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేయాలన్నారు. ఇందులో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నామని అన్నారు. 9, 10 తేదీలలో ద్వారకా గార్డెన్ లో ఉదయ 10 నుండి రాత్రి 10 గంటల వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో చెరువుల పండుగ ను ఘనంగా నిర్వహించుటకుగా తగు ఏర్పాట్లు చేయవలసినదిగా కలెక్టర్ మునిసిపల్ కమీషనర్ల సూచించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM