వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో లక్ష జనహారతి

byసూర్య | Wed, Jun 07, 2023, 06:14 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న తరుణంలో అరుదైన గౌరవం దక్కింది. జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చొప్పున ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను ప్రజలకు తెలియజేస్తూ.. వేడుకలా జరుపుతోంది. ఈ వేడుకలను పురస్కరించుకొని ఇవాళ సాగునీటి దినత్సోవాన్ని రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించారు. జలాశయాలు, చెరువులు, కాలువల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలువల వెంట రైతులు, స్థానిక గ్రామస్థుల ఆధ్వర్యంలో సాగు నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 'కాళేశ్వరం జలానికి - లక్ష జనహారతి' అనే ప్రత్యేక కార్యక్రమానికి మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి పిలుపు మేరకు నియోజవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున కదిలారు. రికార్డు స్థాయిలో లక్షా 16 వేల 142 మంది జలానికి జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో 65,042 మంది మహిళలు ఉండగా.. 51,100 మంది పురుషులు పాల్గొన్నారు.


దీంతో ఈ కార్యక్రమం వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించిన వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధుల కార్యక్రమ సరళిని పరిశీలించారు. సూర్యాపేటలో 8,625 పురుషులు, 11,256 మంది మహిళలు, చివ్వెంలలో 10,454 మహిళలు, 9785 పురుషులు, పెన్ పహాడ్‌లో 11,935 మహిళలు, 8,125 మంది పురుషులు ఆత్మకూరులో 10,156 మహిళలు, 9,521 మహిళలు జాజిరెడ్డి గూడెంలో 9,985 మహిళలు, 8,152 మంది పురుషులు పాల్గొన్నట్లు వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.


ఈ మేరకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తూ.. మంత్రి జగదీష్ రెడ్డికి మెడల్‌తో పాటూ మెమెంటో, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM