దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో

byసూర్య | Wed, Jun 07, 2023, 01:51 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై మండల ఎంపీడీవో విజయ భాస్కర్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్వహిస్తూ, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వంగూరు సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లగౌడ్, మండల పంచాయతీరాజ్ శాఖ అధికారి, వంగూరు గ్రామపంచాయతీ కార్యదర్శి, వంగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

ఆగం అవుదామా.. అభివృద్ధిలో భాగం అవుదామా.. Sat, Sep 30, 2023, 04:01 PM
భార్య కాపురంకు రావడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త Sat, Sep 30, 2023, 04:00 PM
ఇందూరు యువత ఆధ్వర్యంలో అనాధ శవానికి అంత్యక్రియలు Sat, Sep 30, 2023, 03:59 PM
వార్డులలో కొనసాగుతున్న పరిశుభ్రత పనులు Sat, Sep 30, 2023, 03:58 PM
ఆశాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వినతి Sat, Sep 30, 2023, 03:58 PM