లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు అభినందన

byసూర్య | Mon, Jun 05, 2023, 09:17 PM

సిద్దిపేటకు చెందిన లాస్య  ప్రియకు  మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఇదిలావుంటే ఆహా ఓటీటీలో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. ఈ సీజన్-2 పోటీల్లో సౌజన్య విజేత కాగా, లాస్యప్రియ రన్నరప్ గా నిలిచింది. లాస్యప్రియ సిద్ధిపేట అమ్మాయి. దాంతో, మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. సిద్ధిపేట ముద్దుబిడ్డ అంటూ లాస్యప్రియపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో రన్నరప్ గా నిలిచిన లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. మున్ముందు లాస్యప్రియ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.



Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM