రైల్వేశాఖలోని ఆ ఖాళీలను వెంటనే భర్తీచేయండి: వినోెద్ కుమార్

byసూర్య | Mon, Jun 05, 2023, 09:16 PM

రైలు ప్రమాదాలకు సిబ్బంది కొరత కూడా ఓ కారణమన్న విమర్శలువస్తున్నాయి. రైల్వే శాఖలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. 


ఇందులో దక్షిణ మధ్య రైల్వేలోనే 30 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యవేక్షణ లోపానికి దారి తీసి, ప్రమాదాలకు కారణంగా మారుతోందన్నారు. కాబట్టి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.



Latest News
 

పోరాట యోధురాలు ఐలమ్మ : మంత్రి తలసాని Tue, Sep 26, 2023, 03:09 PM
సీఎం కేసీఆర్ ను మూడవ సారీ గెలిపించుకోవాలి: పువ్వాడ Tue, Sep 26, 2023, 02:52 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ Tue, Sep 26, 2023, 02:51 PM
ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే యాదయ్య Tue, Sep 26, 2023, 02:47 PM
తెలంగాణకు అతి భారీ వర్షాల సూచన Tue, Sep 26, 2023, 02:41 PM