పెద్దల్ని ఒప్పించి ప్రేమ పెళ్లి,,,రాజ్‌తో ట్రాన్స్ జెండర్ అంకిత పెళ్లి

byసూర్య | Thu, Jun 01, 2023, 04:52 PM

ఓ అబ్బాయి.. ఓ ట్రాన్స్ జెండర్ మధ్య  ప్రేమ కథ. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ట్రాన్స్‌జెండర్ అంకిత - రాజ్‌ల లవ్ స్టోరీపై ఓ లుక్కేద్దాం.  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గరలోని భీమడోలులో పుట్టిన పెరిగింది అంకిత. ఆమెకు ఇద్దరు సిస్టర్స్. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అంకితను ఆమె తల్లే పెంచి పెద్ద చేసింది. ఎంబీఏ వరకూ చదువుకున్న అంకిత.. తన సిస్టర్స్‌కి పెళ్లి అయ్యేవరకూ తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నా.. ట్రాన్స్ జెండర్‌గా మారకుండా ఉండిపోయింది. వాళ్ల పెళ్లి అయిన తరువాత ట్రాన్స్ జెండర్‌గా మారింది. తాను ట్రాన్స్ జెండర్‌గా మారితో వాళ్ల అక్కలకు ఎక్కడ మంచి సంబంధాలు రావో అని తన కోరికలను ఆశలను తనలోనే దాచుకుని అక్కల పెళ్లి అయ్యేవరకూ ఓపికపట్టింది అంకిత.


తాను ట్రాన్స్ జెండర్‌గా మారటం తన తల్లికి ఇష్టంలేకపోయినా.. మరో ఆప్షన్ లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అంకిత. ఆ తరువాత ఆర్నెళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉంది. హైదరాబాద్‌ వచ్చేసి.. ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీ సలహా తీసుకుంది. ముందు తాను ట్రాన్స్‌జెండర్‌గా మారాలంటే.. మగాళ్లలా వెళ్లి జాబ్ చేయలేదు. ఒకటి సెక్స్ వర్క్ అయినా చేయాలి లేదంటే.. భిక్షాటన అయినా చేయాలి.. కాబట్టి భిక్షాటనను వృత్తిగా ఎంచుకుంది. హైదరాబాద్ ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసేది. ఆ తరువాత షాపింగ్ ఓపెనింగ్స్ వెళ్లేది.


కొన్నాళ్లు అలా చేసిన తరువాత.. ఎంబీఏ చేసి అలా భిక్షాటన చేయడం ఇబ్బంది అనిపించింది అంకితకు. ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ అయిన తరువాత.. ఆమెకు రాజ్ పరిచయం అయ్యాడు. తెల్లవారు జామున ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్తూ ఓ టీ షాప్ దగ్గర టీ తాగుతుండగా.. అక్కడ అంకితకు పరిచయం అయ్యాడు రాజ్.


లవ్ చేస్తే పెళ్లి వరకూ తీసుకుని వెళ్లాలి.. మధ్యలో వదిలేస్తే దాన్ని లవ్ అనరు అని అంటున్నాడు రాజ్. తొలి పరిచయంలోనే అంకితని చూసి ఇష్టపడ్డాడు రాజ్. టాన్స్ జెండర్‌తో లవ్, మ్యారేజ్ అంటే కాస్త ఆలోచించాడు కానీ.. నిజానికి అంకిత టాన్స్ జెండర్‌లా అనిపించకపోవడంతో.. ఆమె ఫోన్ నెంబర్ కోసం ట్రై చేశాడు. తొలి పరిచయంలో అంకిత ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కానీ.. రాజ్ తనని ఇష్టపడటం చూసి.. నెంబర్‌ని ఇచ్చింది అంకిత. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ పడింది. అలా వీరి ప్రేమ పెళ్లి పీటల వరకూ వెళ్లింది. అటు ఫ్యామిలీ నుంచి ఇటు ఫ్యామిలీ నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినా.. వాళ్లందర్నీ ఒప్పించి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అంకిత, రాజ్‌లు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM